Friday, April 6, 2007

Naa America Gaana Sneha Yatra Anubhavaalu-March- May-2007

Nenu Eppudu America yatra cheddamani Talampukaligina oka teliyani Udvegam naalo modalavtundi. Andhra Desam lo ghazal paadadam oka ettu Iyitey, America lo vunna telugu vallaki paadadam oka Ettu. Vaari tho kaalakshepam chesi vaari anubhvalu, Anubhoothulu, vaarilo vunna tapasu, nirantara srama choostuvuntey nenu chaala spoorthi pondutaanu. Andukey vaarikosam prateyekamga ghazals neney vrasukuni paadadam modalu pettanu.
Nenu Modhati saari Americal Rotary GSE member ga vachhanu 1993 lo. Appudu telugu vaari evvarini kalavaledu.

marala 1998 lo ATA sadassuku vachhi ghazals paadanu... appudu evvarini ekkuva kalavaledu. nenu Hero ga natistunna Jandhyala Vichitram shooting ki vellipoyanu. Tharuvaatha marala 2006 lo vachhanu America. Aa Prayanam lo ento mandini dhaggraga kalisaanu, choosanu, sneha atmeeya madhurini pondaanu. chaala mandi goppa vyaktitvam vunnavarini kalisaanu. enno nerchukunnanu...vaari enno madhuramaina ghazallu paadaanu...

A visheshaalu eka meetho muchatinchalani naa prayatnam....mee ku vinalani...chadavaalani vuntey mundiki adugu vesta.... mee andari anumathi kaavali mari...

Dr Ghazal Srinivas
Telugu Ghazal Maestro
www.ghazalsrinivas.com
at present in USA for Ghazal Concerts

17 comments:

Anonymous said...

శ్రీనివాస్ గారూ,

మంచి మొదలు. ఇక తెలుగులో మొదలు పెట్టండి.

విహారి

Ravi Kumar said...

Good beginning.. look forward to more

spandana said...

తెలుగు అక్షరాల్లో మీమాట చూద్దామని...

************
నేను ఎప్పుడు అమెరికా యాత్ర చేద్దామని తలంపుకలిగినా ఒక తెలియని ఉద్వేగం నాలొ మొదలవుతుంది. ఆంధ్ర దేశం లో గజల్ పాడడం ఒక ఎత్తు ఐతే, అమెరికాలొ వున్న తెలుగు వాల్లకి పాడడం ఒక ఎత్తు. వారి తో కాలక్షేపం చేసి వారి అనుభవాలు, అనుభూతులు, వారిలో వున్న తపస్సు, నిరంతర శ్రమ చూస్తూవుంటే నేను చాల స్పూర్తి పొందుతాను. అందుకే వారికోసం ప్రత్యేకంగా గజల్స్ నెనే వ్రాసుకుని పాడడం మొదలు పెట్టాను.
నేను మొదటి సారి అమెరికా Rotary GSE member గా వచ్చాను 1993 లో. అప్పుడు తెలుగు వారి ఎవ్వరినీ కలవలేదు.

మరలా 1998 లో అటా సదస్సుకు వచ్చి గజల్స్ పాడాను... అప్పుడు ఎవ్వరినీ ఎక్కువ కలవలేదు. నేను హీరో గ నటిస్తున్న "జంద్యాల విచిత్రం" షూటింగ్ కి వెల్లిపొయాను. తరువాత మరలా 2006 లో వచ్చాను అమెరికా. ఆ ప్రయాణం లో ఎంతో మందిని దగ్గరగా కలిసాను, చూసాను, స్నేహ అత్మీయ మాధురిని పొందాను. చాల మంది గొప్ప వ్యక్తిత్వం వున్నవారిని కలిసాను. ఎన్నో నేర్చుకున్నాను...వారి ఎన్నోఫ్ మధురమైన గజల్లు పాడాను...

ఆ విశేశాలు ఇక మీతో ముచ్చటించాలని నా ప్రయత్నం....మీకు వినాలని...చదవాలని వుంటే ముందుకు అడుగు వేస్తా.... మీ అందరి అనుమతి కావాలి మరి...

డా. గజల్ శ్రీనివాస్
Telugu Ghazal Maestro
www.ghazalsrinivas.com
at present in USA for Ghazal Concerts

*********************************************
శ్రీనివాస్ గారు, మీ పాట, మీ మాట వినాలని మాకెంతో ఆతృతగా వుంది. అందమైన తెలుగు పదాలను అందమైన తెలుగు అక్షరాల్లో వ్రాయడ ఏమంత కష్టం కదు. ఒకసారి http://lekhini.org/కు వెళ్ళి సాధన చేయండి.

--ప్రసాద్
http://blog.charasala.com

Sudhakar said...

సుస్వాగతం శ్రీనివాస్ గారు.

వీవెన్ said...

శ్రీనివాస్ గారూ, తెలుగు బ్లాగులోకానికి సుస్వాగతం.

సిరిసిరిమువ్వ said...

సుస్వాగతం.
మీ లాంటి వారి మాటలు వినటం కన్నా ఆనందం ఏముంటుందండి. మీరు తెలుగులో రాస్తే ఇంకా బాగుంటుంది. మీ మాటలే కాదు మీ పాటలు కూడా వినిపించండి.

వెంకట రమణ said...

స్వాగతం శ్రీనివాస్ గారు. గుంటూరులోని మాకాలేజిలో మీ కార్యక్రమం జరిగినప్పుడు మిమ్మల్ని చూశాను. ఇప్పుడు ఇలా మీబ్లాగును చూస్తోంటే చాలా ఆనందంగా ఉంది.

చదువరి said...

లేఖినిలో తెలుగు రాయరూ..!
అది -
నల్లేరు మీద నడకేనులే!!

మీరు చెప్పబోయే విశేషాల కోసం ఎదురుచూస్తూ..

Unknown said...

hello

nenu lekhini dwaraa konchem krishi chestunna...usa lo kaasta karyakramala hadavudilo vundi visheshaalu prachurinchadaaniki kaasta vyavadhi paduthondi..

ghazalsrinivas

v_tel001 said...

గజల్ శ్రీనివాస్ గారు,

You can also try Quillpad
http://www.quillpad.in/telugu

ghazalsrinivas said...

మీ అందరికి ధన్యవాదాలు. మీరు ఇచ్చిన సలహాల తో తెలుగులోనే వ్రాయడం మొదలు పెడతా!
మీ అందరికి ఘజల్ గురుంచి పరిచయం చేసి నా వివరాలు కొంత మీకు తెలియా చేస్తా.

తెలుగులో ఘజల్ ప్రవేశం చేసి సుమారు ఓ 30 ఏళ్లు అయింది. డా: దాశరధి తొలి ప్రయత్నం చేశారు
కొన్ని ప్రణయ సంభంధ మైన ఘజాళ్లు వ్రాశారు. డా: సినారె కూడా అదేయ్ కాలం లో వ్రాశారు. కానీఘజాళ్లు గా వాటిని ఆయన ఎక్కడా చెప్పలేదు.
అన్నట్టు ఘజల్ అంటే ఏమిటి పాటకు , ఘజల్ కు ఉన్న తేడా ఏమిటి అన్న సందేహలు వస్తున్నాయి కదా!

ఘజల్ ఆంటెయ్ " ఇష్టమయిన వాలతో సంభాషన అని అర్ధం. ఘజల్ అంటే సంగీతం కాదు, ఘజల్ ఆంటెయ్ సాహిత్యం.

ఘజల్ పల్లవి ని మత్హలా అంటారు. ఘజల్ పల్లవి లోని చివరి పదాలు ప్రతి చరణం లో అంత్య ప్రాశలు గా వస్తాయి.

ఈ అంత్య ప్రాశాలను ఖాఫియా _రాధీఫ్ లాంటారు.


ఇలా ఘజల్ లో 4 నుండి 27 వరకు చరణాలు ఉండవచ్చు
ఆఖరి చరణాన్ని మఖ్త అంటారు

ఆఖరి చరణం లో కవి నామ ముద్ర ఉంటుంది దానిని తక్ఖల్‌లూస్ అంటారు.

ఇక ఘజల్ ఇలా ఉంటుంది ఉధ్ాహరణకి.

రచన- డా: పెన్నా శివ రామ కృష్ణ

నీ చూపే పరిమళించు పద్యం లా ఉంది

నీ మాటే మధుర మైన వాధ్యం లా ఉంది

( పైడి పల్లవి)

తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడ రాదా!
నీవు లేని బ్రతుకు ఎడారిలో సేధ్యం లా ఉంది

ప్రణయ మూర్తి వనుకున్న పాషానమయిపోతివే!
నా మది నువు తాకని నయివేద్యం లా ఉంది

ఎపుడు నీ తోడుగా నాకుండాలని ఉంటుంది
నీడలాగ మారితేనే సాధ్యం లా ఉంది

నీ పేరు తలాలవా గానే మాట తడబడుతోంది
నీ తలపే యుగ యుగాల మద్యం లా ఉంది

ఇది తెలుగు ఘజల్.
దీనిని నా గొంతులో వినాలనుకుంటే నా వెబ్‌సైట్ www.ghazalsrinivas.కోమ్
ని చూడండి
సాంగ్ ప్లయ్ లో క్లిక్క్ చేయండి.

మీ అభిప్రాయం చెప్పండి

డా ఘజల్ శ్రీనివాస్

కవి కన్నయ్య said...
This comment has been removed by the author.
కవి కన్నయ్య said...

శ్రీనివాస్ గారు,
తెలుగు గుంపులోకి స్వాగతం, సుస్వాగతం..

ghazalsrinivas said...

thank u ravi garu

lokesankar said...

శ్రీనివాస్ గారు,
మీకు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇవ్వటము చాలా సంతొషం.
తెలుగు ఘజల్ కు మీరు పొస్తున్న ఊపిరి,తెలుగు ప్రజల ఆదరణ తొడయి మన తెలుగు ఘజల్ మరింత పరిమళించాలని నా ఆకాంక్ష

గౌరిశంకర్ ,విశాఖ,ఇండియా

lokesankar said...

విశాఖలొ మీకు జరిగిన సన్మానికి నేను శ్రొతగా వచ్చాను,మీరు బాలకార్మికుల కొరకై నడుపబడుతున్న బాలవికాస్ సంస్థ కు వెళ్ళి చూపిన చిన్ని వితరణ మరియు నిండు అభిమానం ప్రశంశనీయం.
గౌరి శంకర్ ,విశాఖ

Unknown said...

శ్రీనివాస్ గారు ఇప్పుదు ఎక్కద వున్నారు
గౌరిశంకర్